షూటింగులకు వెళ్లడం నచ్చదు: కీరవాణి తనయుడు కాలభైరవ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగులకు వెళ్లడం నచ్చదు: కీరవాణి తనయుడు కాలభైరవ

  • నాపై మా నాన్నగారి ప్రభావం వుంది 
  •  సినిమా చూసి చాలా థ్రిల్ ఫీలయ్యాను 
  • నా మ్యూజిక్ తప్పకుండా నచ్చుతుందన్న కాలభైరవ
కీరవాణి తనయుడు కాలభైరవ మంచి సింగర్ అనే సంగతి తెలిసిందే. 'మత్తువదలరా' సినిమాకి ఆయనే నేపథ్య సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా నాపై మా నాన్నగారి ప్రభావం వుంది. మా తమ్ముడు హీరోగా చేసే సినిమా ద్వారానే నేను సంగీత దర్శకుడిగా పరిచయమవుతానని ఎప్పుడూ అనుకోలేదు.

మొదటి నుంచి కూడా షూటింగులపట్ల నాకు ఆసక్తిలేదు. అందువలన ఎప్పుడూ ఏ సినిమా షూటింగుకి వెళ్లలేదు .. అలాగే ఈ సినిమా షూటింగుకి కూడా. సినిమా మొత్తం పూర్తయిన తరువాతనే చూశాను .. చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఈ సినిమా యూత్ కి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. అలాగే నేను అందించిన మ్యూజిక్ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Kala Bhairava

More Telugu News